శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 నవంబరు 2022 (11:53 IST)

బాలీవుడ్ హీరోయిన్‌తో టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ డేటింగ్?

prabhas - kritisanon
తెలుగు చిత్రపరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉన్న ప్రభాస్ ఇపుడు ఓ బాలీవుడ్ హీరోయిన్‌తో డేటింగ్‌లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ గుసగుసలను నిజం చేసేలా బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ కొన్ని సంకేతాలు ఇచ్చారు. జలక్ ధికలాజా కార్యక్రమంలో వరుణ్ ధావన్, కృతి సనన్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరుణ్ ధావన్ మాట్లాడుతూ, ఇపుడు కృతి మరొకరి హృదయంలో ఉందంటూ నోరుజారారు. 
 
వరుణ్ ధావన్, కృతిసనన్‌లు కలిసి నటించిన చిత్ర బేదియా. ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా జలక్ ధికలాజ అనే కార్యక్రమానికి అతిథులుగా వచ్చారు. ఈ సందర్భంగానే వరుణ్ ఈ విషయాన్ని వెల్లడించారు. 
 
ఆ వ్యక్తి ముంబైలో ఉండడు. దీపికతో షూటింగులో ఉన్నాడు అని ఈ కార్యక్రమ న్యాయనిర్ణేతల్లో ఒకరైన కరణ్ జొహార్ అడిగిన ప్రశ్నకు వరుణ్ ధావన్ సమాధానం ఇచ్చారు. ఈ లిస్టులో కృతి పేరు లేకపోవడానికి కారణం ఆమె మరొకరి హృదయంలో ఉందని చెప్పారు. 
 
ఈ మాట చెబుతుండగా వరుణ్‌ను కృతి అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ, వరుణ్ మాత్రం తాను చెప్పదలచుకున్న విషయాన్ని బహిర్గతం చేశారు. కాగా, ప్రాజెక్టు కే కోసం ప్రభాస్, దీపికలు కలిసి షూటింగ్‌లో ఉన్న విషయం తెల్సిందే.