1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Navaratri Brahmotsavams: TTD Cancels VIP, Privileged Darshans

వీఐపీలకు షాకిచ్చిన తితిదే... సిఫార్సు లేఖలు బంద్

Tirumala Lord Sri venkateswra
తిరుమలకు వచ్చే వీపీఐలకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) తేరుకోలేని షాకిచ్చింది. నవరాత్రి బ్రహ్మోత్సవాల సమసయంలో సామాన్య భక్తులకు దర్శనభాగ్యం కల్పించేందుకు వీలుగా ఆర్జిత సేవలు, వీఐపీ దర్శనాలను రద్దు చేసింది. మరోవైపు, ఆదివారం నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఇందులోభాగంగా, ఆదివారం రాత్రి 7 గంటలకు సేనాధిపతి విష్వక్సేనుల వారి ఊరేగింపుతో బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరుగనుంది. 
 
అక్టోబరు 20వ తేదీ వరకు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. 21వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు బంగారు తిరుచి ఊరేగింపు, రాత్రి 7 గంటలకు బ్రహ్మోత్సవాలలో తొలి వాహనమైన పెద్దశేష వాహన సేవ జరుగనుంది. ఉత్సవాల నేపథ్యంలో ఈ నెల 20వ తేదీ వరకు ఎలాంటి ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు ఉండవని తితిదే స్పష్టం చేసింది. స్వయంగా వచ్చే ప్రొటోకాల్ ప్రముఖులు మినహా, వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలను స్వీకరించబోమని అధికారులు వెల్లడించారు.
 
ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనం కోసం 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. అక్టోబు 19వ తేదీన 79737 మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. హూండీ ద్వారా 3.71 కోట్ల ఆదాయం లభించింది. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున తితిదే తాగునీరు, అన్నప్రసాదం, భద్రతాపరంగా పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
అమెరికాలో వైకాపా చీఫ్ జగన్‌ సన్నిహితుడుకి 50 నెలల జైలుశిక్ష