ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 జులై 2023 (12:53 IST)

వాకింగ్ చేస్తుండగా గుండెపోటు- 28 ఏళ్ల యువకుడి మృతి

Walking
Walking
గుండెపోటుతో మరణించే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా వాకింగ్‌కు వెళ్లిన యువకుడు గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజాం, మొగిలివలసకు చెందిన శ్రీహరి (28) శుక్రవారం వాకింగ్ వెళ్లాడు. 
 
వాకింగ్ చేస్తుండగా ఉన్నట్టుండి గుండెపోటు వచ్చింది. దీంతో ఒక్కసారిగా శ్రీహరి కుప్పకూలిపోయాడు. గుర్తించిన  అగ్నిమాపక సిబ్బంది రాజాం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 
 
అక్కడ చికిత్స పొందుతూ శ్రీహరి ప్రాణాలు కోల్పోయాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసి పోటీ పరీక్షలకు రెడీ అవుతున్న శ్రీహరి మరణంతో కుటుంబసభ్యులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.