సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శనివారం, 26 ఆగస్టు 2017 (21:30 IST)

తిరుపతిలో దారుణం.. యువతిని రేప్ చేసి హత్య... చేయిపై 'అనిత' అని టాటూ...

తిరుపతిలో దారుణం జరిగింది. 25 యేళ్ళ యువతిని రేప్ చేసి చంపేశారు గుర్తు తెలియని వ్యక్తులు. తిరుపతి-తిరుచానూరు రోడ్డులోని మార్కెట్ యార్డు వెనుక ఒక మహిళ గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలాని

తిరుపతిలో దారుణం జరిగింది. 25 యేళ్ళ యువతిని రేప్ చేసి చంపేశారు గుర్తు తెలియని వ్యక్తులు. తిరుపతి-తిరుచానూరు రోడ్డులోని మార్కెట్ యార్డు వెనుక ఒక మహిళ గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా యువతి శవం కనిపించింది. ముఖంపై రాయితో కొట్టి చంపేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. యువతి వయస్సు 25 యేళ్ళు ఉంటాయని పోలీసులు చెబుతున్నారు. 
 
యువతి ఒంటిపై బట్టలు చిరిగిపోయి ఉండటంతో పాటు అనుమానాస్పదంగా ఉండటంతో అత్యాచారం చేసి చంపేసి ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. యువతి ముఖం పచ్చడిపచ్చడి అయిపోవడంతో ఆమె వివరాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఆమె చేతిపై అనిత అని టాటూతో రాసి ఉంది. దాని ఆధారంగా పోలీసులు ఆచూకీ కోసం వెతుకుతున్నారు.