బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 25 ఆగస్టు 2017 (15:17 IST)

మసాజ్ వ్యాపారంలో నష్టం వచ్చిందనీ వ్యభిచార వృత్తిలోకి...

మసాజ్ వ్యాపారంలో నష్టం వచ్చిందనీ వ్యభిచార వృత్తిలోకి దిగినట్టు పోలీసులకు పట్టుబడిన దాసరి సిద్ధార్థ్ అనే బ్రోకర్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించాడు. ఇటీవల హైదరాబాద్‌ నగరంలోని మాదాపూర్‌, రాయదుర్గ

మసాజ్ వ్యాపారంలో నష్టం వచ్చిందనీ వ్యభిచార వృత్తిలోకి దిగినట్టు పోలీసులకు పట్టుబడిన దాసరి సిద్ధార్థ్ అనే బ్రోకర్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించాడు. ఇటీవల హైదరాబాద్‌ నగరంలోని మాదాపూర్‌, రాయదుర్గం, గచ్చిబౌలిల్లోని మసాజ్‌ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న 12 స్పా కేంద్రాలపై సైబరాబాద్‌ పోలీసులు ఐదు రోజుల క్రితం దాడి చేసిన విషయం తెల్సిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు దాసిర సిద్ధార్థ్‌ సహా 19 మందిని అరెస్ట్‌ చేయగా 65 మంది యువతులను రెస్క్కూ హోంకు తరలించారు. 
 
అయితే, దాసరి సిద్ధార్థ్‌ను కస్టడీకి తీసుకుని విచారించగా అనేక విషయాలను వెల్లడించినట్టు సమాచారం. 'మత్తు మజా కోసం గంజాయిని తీసుకునేవాణ్ణి. కానీ ఏనాడూ కస్టమర్లకు అమ్మలేదు. ఆర్గనైజర్లందరం కలిసి పీల్చేవాళ్ళం. మసాజ్‌ సెంటర్లకు గంజాయి తీసుకురాలేదు' అని వాగ్మూలంలో పేర్కొన్నాడు. జల్సాలకు అలవాటుపడి మసాజ్‌ వ్యాపారంలోకి వచ్చానని, భారీగా నష్టాలు రావడంతో వ్యభిచారం నిర్వహించానని అంగీకరించాడు. సినీ పరిశ్రమకు చెందిన ఇద్దరు జూనియర్‌ ఆర్టిస్ట్‌లు కస్టమర్లుగా ఉన్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించిన విషయం తెల్సిందే.  
 
ఈ ఇద్దరు జూనియర్‌ ఆర్టిస్ట్‌లు మసాజ్‌ కేంద్రాలకు తరచూ వచ్చేవాళ్లని ప్రాథమికంగా నిర్ధారించాం. సిద్ధార్థ్‌ మెబైల్‌ కాల్‌ డేటాను విశ్లేషిస్తే.. ఈ విషయంపై ఒక స్పష్టత వస్తుందని ఒక పోలీస్‌ అధికారి అన్నారు. విచారణ సందర్భంగా పోలీసులు సిద్ధార్థ్‌ నుంచి కీలక సమాచారం రాబట్టారు. దేశంలో మూడు ప్రధాన మెట్రోపాలిటన్‌ నగరాల్లోనూ అతడికి నెట్‌వర్క్‌ ఉన్నట్లు గుర్తించారు.