బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 6 ఆగస్టు 2017 (16:39 IST)

తలకు హెల్మెట్లు ధరించి నిద్రపోతున్న మహిళలు.. ఎందుకు?

ఢిల్లీ శివారు ప్రాంతాల్లో మహిళలు తలకు హెల్మెట్లు ధరించి నిద్రపోతున్నారు. తమ వెంట్రుకలను కాపాడుకునేందుకు ఇలా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీ శివారు ప్రాంతాలతో పాటు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొర

ఢిల్లీ శివారు ప్రాంతాల్లో మహిళలు తలకు హెల్మెట్లు ధరించి నిద్రపోతున్నారు. తమ వెంట్రుకలను కాపాడుకునేందుకు ఇలా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీ శివారు ప్రాంతాలతో పాటు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరదాబాద్ తదితర ప్రాంతాల్లో కొన్ని అదృశ్యశక్తులు మహిళల వెంట్రుకలు కత్తిరిస్తున్న విషయం తెల్సిందే. ఇది ఆయా ప్రాంతాల మహిళల్లో భీతిని కొల్పుతున్నాయి. దీంతో మహిళలు, అమ్మాయిలు రాత్రిపూట తలకు హెల్మెట్లు ధరిస్తున్నారు. 
 
ఢిల్లీ, హర్యానా తదితర ప్రాంతాల్లో అగంతకులు మహిళల జట్టును కత్తిరిస్తున్నారు. ఇటువంటి ఘటనల నుంచి తప్పించుకునేందుకు స్త్రీలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది గుమ్మానికి నిమ్మకాయలు వేలాడదీస్తుండగా, మరికొందరు కాళ్లకు ఎర్రరంగు పూసుకుని తిరుగుతున్నారు. తాజాగా జుట్టు కత్తిరింపుగాళ్ల నుంచి తప్పించుకునేందుకు హెల్మెట్‌లు వాడుతున్న వైనం వెలుగులోకి వచ్చింది.