1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. ACB raids TTD Deputy EO-s residence; assets worth crores identified

తితిదే డిప్యూటీ ఈవో నివాసంలో ఏసీబీ సోదాలు, కోట్లలో ఆస్తులు గుర్తింపు

Golden ornaments
తిరుమల తిరుపతి డిప్యూటీ ఈవో లోకనాథం నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో ఆదాయానికి మించిన ఆస్తులు వెలుగుచూస్తున్నట్లు తెలుస్తోంది. కోట్లలో స్థిర,చరాస్తులను ఆయన కలిగి వున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆయన నివాసం వుంటున్న తిరుపతి పెదకాపు లేఅవుట్లోని ఇంటిలోనూ, ఆయన బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు.
 
ఏసీబీ తనిఖీలు చేస్తున్న సమయంలో ఆయన తన ఇంట్లోనే వున్నారు. ఏసీబీ తనిఖీల్లో కోట్ల రూపాయలు విలువైన బంగారు ఆభరణాలు, స్థిర, చరాస్తులు గుర్తించినట్లు తెలుస్తోంది. తితిదే అధికారిపై ఏసీబీ దాడులు జరగడం చాలా అరుదు. పదిహేనేళ్ల క్రితం అప్పట్లో తితిదే డిప్యూటీ ఈవో భూపతిరెడ్డిపై ఇలాగే ఏసీబీ సోదాలు నిర్వహించింది.  
About Writer
ఐ వెెంకట్
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలలో పనిచేసారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ముద్రా రుణం మంజూరైంది... బ్యాంకు వివరాలు పంపిండి... వాట్సాప్ మెసేజ్ వచ్చిందంటే జాగ్రత్త!!