1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Telangana ACB Raids Narahari’s Properties in DA Case

నరహరి ఇంట్లో సోదాలు.. అమ్మో ఎంత డబ్బు.. ఎంత బంగారం.. ఏసీబీ షాక్ (video)

Cash
Cash
అవినీతికి పాల్పడిన ప్రభుత్వ అధికారులపై చర్యలను కొనసాగిస్తూ, తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అక్రమ ఆస్తుల కేసులో భాగంగా భూమి, సర్వే శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎస్. నరహరికి చెందిన సుమారు డజను ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. నరహరి కార్యకలాపాలపై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందడంతో, అధికారులు ఆయన నివాసంతో పాటు పాతబస్తీలోని ఛత్రీనాక, నారాయణగూడ తదితర ప్రాంతాల్లో సోదాలు చేపడుతున్నారు. ఈ సోదాలు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది. 
 
కాగా, కొద్ది రోజుల క్రితం రోడ్లు-భవనాల శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ మోహన్ నాయక్ జరుప్లాపై కూడా ఏసీబీ అక్రమ ఆస్తుల కేసు నమోదు చేసింది. సర్వీసులో ఉన్న సమయంలో అవినీతి, అక్రమ మార్గాల ద్వారా ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై ఈ చర్య తీసుకున్నారు. ఆ సోదాల్లో రూ. 17.94 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించిన అధికారులు నాయక్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.
 
తాజాగా త‌వ్వ‌కొద్దీ బంగారం.. ఇంటి నిండా నోట్ల క‌ట్ట‌లు బయటపడుతున్నాయి. ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి ఇంటిపై ఏసీబీ దాడుల్లో భారీగా నగదు బయటపడింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ ప్రత్యేక బృందాల తనిఖీల్లో భారీగా నగదు కట్టలు, బంగారం, వెండి, కీలక భూ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. 
 
ఇంకా బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లోనూ కొనసాగుతున్న విస్తృత సోదాలు జరుగుతున్నాయి. రెవెన్యూ రికార్డులు, ల్యాండ్ ప్లాట్ల డాక్యుమెంట్లను అధికారులు ఇంకా పరిశీలిస్తున్నారు. 
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
19 నుంచి భారీ వర్ష సూచన : వాతావరణ శాఖ హెచ్చరిక