1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Accident on Srisailam Ghat Road

శ్రీశైలం ఘాట్‌రోడ్డులో ప్రమాదం

Accident
శ్రీశైలం ఘాట్‌రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. తెలంగాణ నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్‌ మండలం ఈగలపెంట సమీపంలో మూల మలుపు వద్ద రక్షణ గోడను వ్యాను ఢీకొని 20 అడుగుల లోయలో పడిపోయింది.

ఘటన జరిగిన సమయంలో అందులో 9 మంది ఉన్నారు. వీరిలో ఏడుగురికి తీవ్ర గాయాలు కాగా.. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.

క్షతగాత్రులను ఈగలపెంట జెన్‌కో ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్‌ దూల్‌పేటకు చెందిన కొంతమంది భక్తులు శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలానికి ఈగలపెంట ఎస్సై పోచయ్య చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
తర్వాతి కథనం
వైఎస్ఆర్ సీపీ పాలనలో రైతులకు అన్యాయం జరగదు: మంత్రి మేకపాటి