మంగళవారం, 18 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (19:07 IST)

తాడిపత్రిలో ఘోర రోడ్డు ప్రమాదం

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం తిరుచానూరు నుంచి తాడిపత్రికి వస్తున్న తుఫాన్ వాహనాన్ని గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టింది.

ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఘటనా స్థలాన్ని పరిశీలించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు చెక్ పోస్టుల వద్ద సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.