సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 9 జులై 2020 (09:42 IST)

అనంతపురం రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

అనంతపురం జిల్లాలోని రాప్తాడు మండలం గొల్లపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్‌- బెంగళూర్‌ హైవేపై వేగంగా వస్తున్న కారు బోల్తా పడింది.

ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడటంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులు వివరాలు  వెంటనే వెల్లడి కాలేదు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.