శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 24 డిశెంబరు 2018 (09:01 IST)

ఆవును తాటిచెట్టుకు కట్టేసి లైంగికదాడి...

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో గోమాతపై లైంగికదాడి జరిగింది, ఆవును తాటిచెట్టుకు కట్టేసి ఈ దారుణానికి పాల్పడ్డారు కొందరు కామాంధులు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పిఠాపురం మండలం గోకివాడ గ్రామానికి చెందిన నామా బుచ్చిరాజు అనే వ్యక్తి తన పశువుల పాకలో మూడు ఆవులు, రెండు గిత్తలు, ఒక దూడను కట్టేశారు. 
 
బుచ్చిరాజు తెల్లవారుజామున పాకవద్దకు వెళ్లాడు. అపుడు పాకలో ఒక ఆవు కనిపించలేదు. దీంతో చుట్టుపక్కల గాలించగా, ఓ తాటిచెట్టుకు ఆవును కట్టేసి వుంది. ఆవును నిశితంగా పరిశీలించగా, మర్మాంగం వద్ద రక్తపు మరకలు కనిపించాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. గోవుకు వైద్య పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో ఆవుపై లైంగికదాడి జరిగినట్టు పశువైద్యాధికారి నిర్ధారించారు. దీంతో ఈ పాడుపనికి పాల్పడిన కామాంధుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ లైంగికదాడికి గురైన ఆవు మూడు నెలల గర్భిణి కావడం గమనార్హం.