శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: శనివారం, 22 డిశెంబరు 2018 (20:58 IST)

నాలుగేళ్ల చిన్నారిపై కామాంధుడు అత్యాచార యత్నం... చాక్లెట్ ఆశ చూపి...

బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు కామాంధుడు ఇంజమాను హులక్. పాపను గదిలోకి తీసుకెళ్లి.. నోరు నొక్కేసి అత్యాచారానికి తెగబడ్డాడు. భయాందోళనకు గురై బిగ్గరగా విలపిస్తూ.. కేకలు వేసింది ఆ బాలిక‌. దీంతో ఆ కామాంధుడ్ని పట్టుకుని దేహశుద్ది చేసిన స్థానికులు అనంతరం అతడిని సనత్ నగర్ పోలీసులకు అప్పగించారు. బాలికను పోలీసులు వైద్య పరీక్షలకు పంపించారు. చాక్లెట్ ఇస్తానని ఆశపెట్టి నాలుగేళ్ల బాలికను ఎత్తుకెళ్లాడు. గదిలో నిర్భంధించి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. 
 
హైదరాబాద్ సనత్ నగర్ ఫతేనగర్‌లో జరిగింది ఈ దారుణం. బీహార్‌కు చెందిన ఓ వెల్డర్ తన కుటుంబంతో ఫతేనగర్ పైప్ లైన్ రోడ్డులోని భవనం మొదటి అంతస్తులో నివాసముంటున్నారు. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. రెండో కుమార్తె నాలుగేళ్ల వయస్సున్న ఈ బాలిక ఒకటో తరగతి చదువుతోంది. స్కూల్ నుంచి ఇంటికొచ్చిన బాలిక ఆడుకోసాగింది. రెండో అంతస్తులో నివాసముండే బీహార్‌కు చెందిన ఇంజమాన్ హులక్ అనే పాతికేళ్ల వ్యక్తి చాక్లెట్ ఇస్తానని నమ్మించి పాపను ఎత్తుకెళ్లాడు. తన గదిలోకి తీసుకెళ్లి.. తలుపునకు గడియపెట్టేశాడు. పాప నోరు నొక్కేశాడు. 
 
పాపపై అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. భయపడిన బాలిక ఏడుస్తూ.. బిగ్గరగా అమ్మా అంటూ కేకలు వేసింది. గమనించిన స్థానికులు పాప తల్లికి విషయం చెప్పారు. పరుగున వెళ్లిన తల్లి చూసేసరికి జరిగిన ఘోరం కళ్లముందు కనిపించింది. పసిపాప వివస్త్రరాలై ఉండటంతో ఖిన్నురాలైన తల్లి ఏం జరిగిందని కుమార్తెని అడిగి తెల్సుకుంది. తనపై జరిగిన దారుణం గురించి బిడ్డ చెప్పడంతో తల్లికి ఆవేశం కట్టలు తెంచుకుంది. గమనించిన స్థానికులంతా కలిసి ఆ కామంధుడు ఇంజమాన్ హులక్‌ను పట్టుకుని.. దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.