శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. ఫాస్ట్ ఫుడ్
Written By
Last Updated : శనివారం, 22 డిశెంబరు 2018 (14:08 IST)

బ్రెడ్ మంచూరియా ఎలా చేయాలో తెలుసా?

కావలసిన పదార్థాలు:
బ్రెడ్ ముక్కలు - 6
మొక్కజొన్నపిండి - 2 స్పూన్స్
మైదాపిండి - అరస్పూన్
పెప్పర్ - తగినంత
ఉల్లిపాయ - 1
క్యాప్సికమ్ - 1
వెల్లుల్లి రేకులు - 4
అల్లం పేస్ట్ - 1 స్పూన్
పచ్చిమిర్చి - 3
సోయాసాస్ - 1 స్పూన్
వెనిగర్ - అరస్పూన్
కారం - అరస్పూన్
అజీనామోటో - పావుస్పూన్
కలర్ -కొద్దిగా
పంచదార - అరస్పూన్
ఉప్పు - తగినంత
నూనె - సరిపడా.
 
తయారీ విధానం:
ముందుగా ఒక గిన్నెలో మైదాపిండి, మొక్కజొన్నపిండి, పెప్పర్, ఉప్పు, నీరు పోసి జారుగా కలుపుకోవాలి. ఇప్పుడు పెనంలో నూనె పోసి వేడయ్యాక బ్రెడ్ ముక్కల్ని ఆ పిండిలో ముంచి పెనంపై వేసి సన్నమంటపై వేయించాలి. బ్రెడ్ ముక్కలు రెండువైపులా ఎర్రగా వేగిన తరువాత చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
 
ఇప్పుడు మరో బాణలిలో నూనె పోసి కాగాక వెల్లుల్లి రేకులు, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యాప్సికమ్ ముక్కలు వేసి వేయించాలి. తరువాత సోయాసాస్, వెనిగర్, కారం, అజీనామోటో, ఫుడ్‌కలర్, పంచదార, ఉప్పు వేసి బాగా కలిపి సన్ననిమంటపై ఉడికించాలి. ఇప్పుడు ముందుగా వేయించిన బ్రెడ్ ముక్కల్ని వేసి 10 నిమిషాల పాటు అలానే ఉంచాలి. అంటే.. బ్రెడ్ మంచూరియా రెడీ.