రేగి అప్పాలు తయారీ విధానం..?
కావలసిన పదార్థాలు:
రేగిపండ్లు - పావుకిలో
ఎండుమిర్చి - 6
ఇంగువ - చిటికెడు
బెల్లం - 3 స్పూన్స్
ఉప్పు - 1 స్పూన్.
తయారీ విధానం:
ముందుగా పైన తెలిపిన పదార్థాలన్నింటిని ఓ గిన్నెలో వేసి బాగా కలుపుకుని మిక్సీలో కాస్త కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు రేగిపండ్లలోని విత్తనాలను తీసేసి వాటిని కూడా మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తరువాత చేతులకు కొద్దిగా నూనె రాసుకుని ఈ మిశ్రమంతో చిన్న చిన్న అప్పాలుగా చేసుకోవాలి. ఇలా చేసిన వాటిని ఓవెన్‌లో గానీ, ఇడ్లీ కుక్కర్‌లో గానీ 2 నిమిషాల పాటు ఉంచి దించేయాలి. అంతే... ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రేగి అప్పాలు రెడీ..