శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By
Last Updated : శుక్రవారం, 21 డిశెంబరు 2018 (22:08 IST)

సమంతకు కుమారుడిగా రావు రమేష్.. బేబీ అని ఎవరు పిలుచుకుంటారో..?

టాలీవుడ్ అందాల రాశి సమంత ప్రస్తుతం విభిన్న పాత్రల్లో కనిపించేందుకు తారసపడుతోంది. పెళ్లికి తర్వాత కూడా హీరోయిన్‌గానూ వైవిధ్య పాత్రల్లో అలరించేందుకు సమంత సిద్ధమైంది. పెళ్లైనప్పటికీ కెరీర్‌పై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా గుర్తింపు తగిన పాత్రలను ఎంచుకుంటోంది. ఇందులో ఒకటే... కొరియన్ మూవీ రీమేక్ మిస్ గ్రానీ. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. 
 
ఈ చిత్రంలో వృద్ధురాలి పాత్రలో సమంత కనిపిస్తుంది. వృద్ధురాలిగా.. 70 ఏళ్ల వృద్ధురాలు 20 ఏళ్ల యువతిగా మారిపోతే ఎలా వుంటుందనే కథనంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఇందులో 60 ఏళ్ల వృద్ధురాలికి కుమారుడిగా విలక్షణ నటుడు రావు రమేష్ నటించనున్నాడని తెలిసింది. ఈ సినిమాకు బేబీ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 
 
ఈ రోల్ ద్వారా రావు రమేష్ కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంటారని.. సమంతతో బేబీలో రావు రమేష్ దృశ్యాలు ఆకట్టుకునే రీతిలో వుంటాయని సినీ యూనిట్ వెల్లడిస్తోంది. ఈ సినిమాకు నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.