ఆదివారం, 16 ఫిబ్రవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. వ్యక్తిత్వ వికాసం
Written By
Last Updated : గురువారం, 20 డిశెంబరు 2018 (15:50 IST)

అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం..?

1. గెలిస్తే వినయంగా ఉండు..
ఓడితే ఓర్పుగా ఉండు..
డబ్బు ఉంటే దయాగుణంతో ఉండు..
డబ్బు లేకుంటే నిజాయితీగా ఉండు..
 
2. ప్రాణం పైకి పోతుంది.
దేహం కిందికి పోతుంది.
కాని పేరు శాశ్వతంగా మిగిలిపోతుంది.
ప్రాణాన్ని, దేహాన్ని కాపాడుకోవడం కన్నా.. పేరుని కాపాడుకోవడం గొప్ప..
 
3. నిజం చెప్పకపోవడం అబద్దం..
అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం..
 
4. ఒకటి గుర్తు పెట్టుకో జీవితంలో కష్టపడకుండా ఏది రాదు..
 
5. అపార్థం చేసుకునేదానిలో పదో వంతును అర్ధం చేసుకోవడానికి..
ప్రయత్నిస్తే ఎన్నో సమస్యలు మటుమాయమవుతాయి.