సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 19 డిశెంబరు 2018 (10:20 IST)

కేన్సర్ నయం చేస్తానంటూ 300 మంది మహిళలపై ఫెయిత్ హీలర్ అత్యాచారం

ఆధ్యాత్మిక ముసుగుతో పాటు రోగాలు నయం చేస్తానంటూ అనేక మంది దొంగ బాబాలు, స్వామీజీలు, ఫాస్టర్లు అకృత్యాలకు పాల్పడుతున్న సంఘటనలు తరచుగా వింటున్నాం. తాజాగా మధ్య బ్రెజిల్‌లో ఫెయిత్ హీలర్‌గా చెప్పుకునే ఓ ఫాస్టర్ ఏకంగా 300 మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో అనేక మంది విదేశీ మహిళా భక్తులు కూడా ఉన్నారు. ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున వార్తలు రావడంతో స్పందించిన కోర్టు జడ్జి ఒకరు ఆ దైవాంశసంభూతుడు అరెస్ట్ వారెంట్ జారీచేశారు. దీంతో ఆ ఫెయిత్ హీలర్ కోర్టులో లొంగిపోయాడు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, సెంట్రల్ బ్రెజిల్‌లోని అబడియానియాలో గొయాస్ అనే గ్రామంలో జావో టీగ్జీరియా డి ఫారియా అనే 76 యేళ్ళ వృద్ధుడు తనను తాను ఫెయిల్ హీలర్ (దైవాంశ సంభూతుడు)గా ప్రచారం చేసుకున్నాడు. పైగా, కేన్సర్ వంటి అనేక రోగాలను చిటికెలో నయం చేస్తానంటూ స్థానికులను నమ్మించాడు. ఈ రోగాల నయం పేరుతో మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారు. అలా ఏకంగా 300 మందిని రేప్ చేశాడు. 
 
పైగా, బండారం బయటపడకుండా ఉండేందుకు ఆయన 2013లో ఓఫ్రా విన్‌ఫ్రే ఓ ఆధ్యాత్మిక కేంద్రాన్ని నడుపుతూ వచ్చాడు. దీంతో ఆయన ఓ సెలెబ్రిటీగా మారిపోయాడు. దీన్ని కేంద్రంగా చేసుకుని తన వద్దకు వచ్చే అనేక మంది మహిళలపై ఆయన అత్యాచారానికి పాల్పడుతున్నట్టు పెద్దఎత్తున వార్తలు వచ్చాయి. దీంతో స్పందించిన జడ్జి శుక్రవారం అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. శనివారంలోగా కోర్టులో హాజరు పరచాలని పోలీసులను ఆదేశించారు. విషయం తెలిసిన ఫారియా తనను క్షమించాలని వేడుకున్నాడు. ఆ తర్వాతి రోజే పోలీసుల ఎదుట లొంగిపోయాడు.