గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 12 అక్టోబరు 2018 (13:40 IST)

కన్నబిడ్డపై తల్లి స్వలింగసంపర్క దాడి.. కుమార్తెను ప్రోత్సహించిన బామ్మ...

సభ్య సమాజం తలదించకునే సంఘటన ఒకటి తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. నిజానికి ఇప్పటివరకు కుమార్తెలపై కామంతో కళ్లుమూసుకునిపోయిన తండ్రులు అత్యాచారం చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కానీ, ఇక్కడ కన్నతల్లే 14 యేళ్ళ కుమార్తెపై లైంగికదాడికి తెగబడింది. ఈ చర్యకు ఆమె బామ్మ (అవ్వ) కూడా వత్తాసు పలికింది.
 
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలోని స్థానిక తేనాంపేటలో జరిగిన ఈ ఘటన వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. స్థానిక తేనాంపేటకు చెందిన ఓ మహిళ కట్టుకున్న భర్తతో మనస్పర్థలు రావడంతో విడిపోయింది. ఆమె తన కుమార్తె, తల్లితో కలిసి వేరుగా జీవిస్తోంది. ఈ క్రమంలో ఆ మహిళ స్వలింగ సంపర్కానికి బానిసైంది. దీంతో కుమార్తెతో స్వలింగ సంపర్కం పెట్టుకునేందుకు ప్రయత్నిస్తూ ఆమెపై ఒత్తిడి తెచ్చింది. దీనికి ఆ మహిళ తల్లి కూడా తనవంతుగా ఒత్తిడి చేసింది.
 
దీంతో కన్నతల్లి, బామ్మ వేధింపులు భరించలేని ఆ బాలిక ఈ విషయాన్ని తండ్రి దృష్టికి తీసుకెళ్లింది. అయినా కన్నతల్లిలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో కుమార్తెతో కలిసి కన్నతండ్రి పోలీస్టేషన్ మెట్లు ఎక్కాడు. తన భార్య, అత్త కలిసి కుమార్తెను లైంగిక వేధింపులకు గురిచేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సాక్ష్యంగా సెల్‌ఫోన్‌లో వీడియో ఆధారాన్ని కూడా పోలీసులకు సమర్పించాడు. పోలీసులు బాలిక తల్లిని పోక్సో చట్టం క్రింద, దీనికి ప్రోత్సహించిన ఆమె బామ్మను అరెస్టు చేశారు.