మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 8 అక్టోబరు 2018 (10:26 IST)

కన్నబిడ్డను నీటి సంపులో పడేసి చంపేసిన తల్లి...

భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అక్కసుతో ఓ కసాయి తల్లి కన్నబిడ్డను నీటి సంపులో పడేసి చంపేసింది. ఆ తర్వాత ఆ నేరాన్ని కట్టుకున్న భర్తపై మోపేందుకు ప్రయత్నించింది. కానీ, పోలీసుల విచారణలో అన్ని విషయాలు వెల్లడికావడంతో ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తోంది.
 
హైదరాబాద్ నగరంలోని మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ క్రైమ్ న్యూస్ వివరాలను పరిశీలిస్తే, మాదన్నపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో మూక్రమ్ అనే వ్యక్తి ఉన్నారు. ఈయనకు వివాహమై ముగ్గురు ఆడపిల్లలతో పాటు ఒక కుమారుడు ఉన్నాడు. 
 
ఈ క్రమంలో మూక్రమ్‌కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో భర్తపై ఉన్న కోపంతో మూడు సంవత్సరాల కొడుకు రెహాన్‌ను నీటిసంపులో పడేసి చంపేసింది. 
 
ఈ నేరాన్ని తన భర్తే చేశాడని నమ్మించేందుకు ప్రయత్నించింది. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు అసలు నిజం తెలిసింది. దీంతో మాక్రమ్ భార్యను అరెస్టు చేశారు. కేసు విచారణ జరుపుతున్నారు.