మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 2 అక్టోబరు 2018 (11:47 IST)

కొత్త ప్రియుడు మోజులోపడి పాత ప్రియుడ్ని నమ్మించి చంపేసిన ప్రియురాలు...

ఢిల్లీలో మరో దారుణం జరిగింది. కొత్త ప్రియుడు మోజులో పడిన ఓ యువతి తన పాత ప్రియుడిని నమ్మించి పార్కుకు పిలిచి చంపేసింది. ఈ హత్య ఢిల్లీలోని ఓ లగ్జరీ హోటల్ వెనుక భాగంలోనే జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చి

ఢిల్లీలో మరో దారుణం జరిగింది. కొత్త ప్రియుడు మోజులో పడిన ఓ యువతి తన పాత ప్రియుడిని నమ్మించి పార్కుకు పిలిచి చంపేసింది. ఈ హత్య ఢిల్లీలోని ఓ లగ్జరీ హోటల్ వెనుక భాగంలోనే జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఢిల్లీలోని రాడిసన్ బ్లూ హోటల్ సమీపంలో 30 ఏళ్ల యువకుని మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో మృతుడు భరత్ విహార్ ప్రాంతానికి చెందిన రాజారాంగా గుర్తించారు. 
 
ఆ తర్వాత సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌లు, మృతుడి కాల్ రికార్డులను పరిశీలించారు. ఈ పరిశీలనలో అతని ప్రియురాలే హత్య చేయించిందని గుర్తించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె వద్ద విచారణ జరుపగా అసలు విషయం తెలిసింది.
 
తనకు రెండున్నరేళ్ల నుంచి రాజారాం పరిచయమని, ఆపై కిరణ్ అనే మరో యువకుడు పరిచయం అయ్యాడని తెలిపింది. ఆ తర్వాత రాజారాంను దూరపెడుతూ వచ్చాననీ, కానీ, రాజారాం మాత్రం తనను వదిలిపెట్టకుండా వేధిస్తూ వచ్చాడని చెప్పింది. 
 
దీంతో తన కొత్త ప్రియుడు కిరణ్‌తో కలిసి రాజారాంను కడతేర్చినట్టు చెప్పింది. రాజారాంను ఓ పార్కు వద్దకు రమ్మని పథకం ప్రకారం హత్య చేయించింది. ఈ కేసులో ప్రేయసీ ప్రియులను అరెస్ట్ చేశామని, తదుపరి విచారణ కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు.