బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 8 అక్టోబరు 2018 (09:29 IST)

మహిళతో సహజీవనం.. కడదాకా కలిసుంటానని.. కడతేర్చాడు...

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళకు కడవరకు కలిసివుటానని నమ్మించి సహజీవనం చేశాడు. ఆ తర్వాత మధ్యలోనే కడతేర్చాడు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... చంద్రుగొండ మండలం అయ్యన్నపాలెం గ్రామానికి చెందిన గుంజా రాధాకృష్ణ కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. మద్యానికి బానిసై భార్యను, పిల్లలను వదిలేసి ఒంటరిగా జీవిస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి పాల్వంచ మండలం మందెరికలపాడు గ్రామానికి చెందిన సాంబలక్ష్మి(28)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ తర్వాత ఆమెను నమ్మించి కడవరకు కలిసివుంటానని చెప్పి సహజీవనం చేస్తూ వచ్చాడు. 
 
అయితే, ఇటీవల తరచూ వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. శుక్రవారం అర్థరాత్రి ఇద్దరూ ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో సాంబలక్ష్మిని బలంగా కొట్టడంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతిచెందింది. పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న రాధాకృష్ణ కోసం గాలిస్తున్నారు.