మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 9 అక్టోబరు 2018 (11:11 IST)

అక్కతో భర్త అక్రమ సంబంధం... నీటి సంపులో కన్నబిడ్డను పడేసిన భార్య...

అక్కతో తన భర్త అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలోని ఓ మహిళ... కన్నబిడ్డను నీటి సంపులో పడిసే చంపేసింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌ నగరంలోని  రామచంద్రనగర్‌లో జరిగింది.


తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రామచంద్రనగర్‌కు చెందిన మహ్మద్‌ ముక్రం వాహనాల క్రయ విక్రయాల వ్యాపారి. అతడికి పదేళ్ల క్రితం నుస్రత్‌ బేగంతో వివాహమైంది. వీరికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు మహ్మద్‌ రెహాన్‌(3) ఉన్నారు. ఇంటి పైపోర్షన్‌లో నుస్రత్ బేగం అక్క నివశిస్తోంది. ఆమెతో ముక్రం వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం నుస్రత్‌కు తెలిసింది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. 
 
దీనిపై నుస్రత్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, భార్యాభర్తలిద్దరినీ స్టేషన్‌కు పిలిచి... కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించేశారు. ఆదివారం రాత్రి భార్యాభర్తల మధ్య ఇదే విషయమై మరోసారి గొడవ జరిగింది. కొద్దిసేపటికి రెహాన్‌ ఇంట్లో ఉన్న నీటి సంపులో పడి మృతి చెందాడు. తనపై కోపంతోనే కొడుకును సంపులో తోసి హత్య చేసిందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.