శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 16 డిశెంబరు 2018 (14:44 IST)

ఉత్కంఠకు తెరపడింది.. శ్రీలంక ప్రధానిగా రణిలి విక్రమ సింఘే

దాదాపు రెండు నెలలుగా కొలంబోలో కొనసాగుతూ వచ్చిన ఉత్కంఠకు తెరపడింది. శ్రీలంక దేశ ప్రధానిగా రాణిల్ విక్రమసింఘే మరోమారు బాధ్యతలు స్వీకరించారు. 51 రోజుల క్రితం ఆయనను ప్రధాని పదవి నుంచి దించిన అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనే విక్రమసింఘేతో ఇపుడు ప్రమాణం చేయించారు. కొలంబోలోని అధ్యక్షుడి సెక్రటేరియట్‌లో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా విక్రమసింఘే ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. 
 
శనివారం మహిందా రాజపక్సే ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో మరోసారి విక్రమసింఘేకు లైన్ క్లియరైంది. అక్టోబర్ 26న శ్రీలంకలో రాజకీయ సంక్షోభం మొదలైన విషయం తెలిసిందే. ఆ రోజు ప్రధానిగా ఉన్న విక్రమసింఘేను తొలగించి రాజపక్సేను సిరిసేన నియమించడంతో వివాదం మొదలైంది. రాజపక్సే నియామకం చెల్లదంటూ సుప్రీంకోర్టే చెప్పడంతో చేసేది లేక ఆయన తప్పుకున్నారు. శుక్రవారమే విక్రమసింఘేతో ఫోన్‌లో మాట్లాడిన సిరిసేన.. ఆయనను మరోసారి ప్రధానిని చేయడానికి అంగీకరించారు.