శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 8 అక్టోబరు 2018 (19:14 IST)

ఆసియా అండర్-19.. అదరగొట్టిన టీమిండియా కుర్రాళ్లు.. లంకపై జయభేరి

ఆసియా అండర్-19లో భారత కుర్రాళ్లు కుమ్మేశారు. ఆదివారం ఢాకాలో జరిగిన అండర్-19 ఆసియా కఫ్ ఫైనల్లో శ్రీలంకను భారత కుర్రాల్లు చిత్తుగా ఓడించారు

ఆసియా అండర్-19లో భారత కుర్రాళ్లు కుమ్మేశారు. ఆదివారం ఢాకాలో జరిగిన అండర్-19 ఆసియా కఫ్ ఫైనల్లో శ్రీలంకను భారత కుర్రాల్లు చిత్తుగా ఓడించారు. ఫలితంగా భారత కుర్రాళ్లు ఆరో టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో ఆధిపత్యం చెలాయించిన కుర్రాళ్లు 144 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకున్నారు. 
 
ఆసియా కప్‌లో తొలి ఐదు టైటిళ్లను సొంతం చేసుకున్న భారత్‌, 2017లో మలేషియాలో జరిగిన టోర్నీలో సెమీఫైనల్లోనే నిష్క్రమించింది. కానీ ఈసారి అజేయ రికార్డుతో సత్తా చాటిన సిమ్రాన్‌ సింగ్‌ సేన ఏకపక్ష విజయంతో ఆరో టైటిల్‌ సాధించింది. 
 
తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లకు 304 పరుగుల భారీ పరుగులు సాధించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (85), అనుజ్‌ రావత్‌ (57)లు తొలి వికెట్‌కు 121 పరుగులు జోడించారు. 
 
25 ఓవర్ల పాటు లంకేయులకు వికెట్‌ ఇవ్వకుండా ఆటాడుకున్న ఓపెనర్లు భారీ స్కోరుకు పునాది వేశారు. పడిక్కల్‌ (31) పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో 194/3 స్కోరు వద్ద కెప్టెన్‌ సిమాన్ర్‌ సింగ్‌ (65), ఆయూశ్‌ బదొని (52)లు మెరుపు ఇన్నింగ్స్‌లతో బ్యాటింగ్‌లో అదరగొట్టారు. 
 
అర్ధ సెంచరీతో భారీ స్కోరు అందించారు. వీరిద్దరి విజృంభణతో భారత్‌ 304 పరుగులు సాధించగలిగింది. కానీ లక్ష్య చేధనలో శ్రీలంక చతికిలపడింది. శ్రీలంక బ్యాట్స్‌మెన్ల మన కుర్రాళ్లు చుక్కలు చూపించారు. 
 
శ్రీలంక ఓపెనర్‌, కెప్టెన్‌ నిపున్‌ ధనంజయ (12)ను ఆరంభంలోనే పేసర్‌ మోహిత్‌ జంగ్రా పెవిలియన్‌కు పంపాడు. తర్వాత స్పిన్నర్‌ హర్ష త్యాగి (6/38)తో అదరగొట్టాడు. ఫలితంగా లంక 38.4 ఓవర్లలో ఆ జట్టు 160 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత కుర్రాళ్లు విజయభేరి మోగించారు.