శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 19 సెప్టెంబరు 2018 (14:15 IST)

భారత్-హాంకాంగ్ మ్యాచ్‌లో జనసేన జెండా

దుబాయ్‌లో వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లో భాగంగా భారత్-హాంకాంగ్ మ్యాచ్‌లో భారత్ పోరాడి గెలిచింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ జనసేన జెండాతో హల్ చల్ చేశారు. తెలుగు రాష్

దుబాయ్‌లో వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లో భాగంగా భారత్-హాంకాంగ్ మ్యాచ్‌లో భారత్ పోరాడి గెలిచింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ జనసేన జెండాతో హల్ చల్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో పవన్‌కు ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మ్యాచ్ జరుగుతున్న వేళ, జనసేన జెండాలను గ్యాలరీల్లో వీరు ప్రదర్శించారు. 
 
భారత క్రికెట్ జట్టు వీరాభిమానులు కూర్చున్న ప్రాంతంలోనే ఉన్న పవన్ అభిమానులు, ఈ జెండాను ఊపుతూ హడావుడి చేయడంతో, క్రికెట్ మ్యాచ్ జరిగిన సమయంలో పలుమార్లు జనసేన పతాకం కనిపించింది.
 
ఇదిలా ఉంటే.. ఆసియా కప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్‌ల మధ్య పోరు ప్రారంభం కానుంది. ఆసియా కప్ గత చరిత్రను బట్టి చూస్తే.. ఈ మ్యాచ్‌లోనూ టీమిండియాదే గెలుపు అంటూ క్రీడా పండితులు చెప్తున్నారు. 
 
ఇప్పటివరకూ ఆసియా కప్‌లో భాగంగా 12 సార్లు ఇండియా, పాకిస్థాన్ తలపడగా, 6 సార్లు భారత్, 5 సార్లు పాక్ విజయం సాధించగా, ఓ మారు మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది. దీంతో ఈసారి కూడా భారత్ దాయాది దేశమైన పాకిస్థాన్‌పై గెలుపును నమోదు చేసుకుంటుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.