సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 19 డిశెంబరు 2018 (09:40 IST)

కంత్రీ కుర్రోడు: 30 మంది అమ్మాయిల నగ్న వీడియోలు

హైదరాబాద్ నగరంలో ఓ కంత్రీ కుర్రోడి వ్యవహారం బట్టబయలైంది. లేడీస్ హాస్టల్‌లో ఉండే అమ్మాయిలు స్నానం చేస్తుంటే నగ్న వీడియోలు తీశాడు. అలా ఏకంగా 30 మంది అమ్మాయిల నగ్నవీడియోలు తీసి తన ట్యాబ్‌లో భద్రపరిచాడు. చివరకు ఆ కంత్రీ కుర్రోడిని ఓ అమ్మాయి గుర్తించి హాస్టల్, పోలీసు సిబ్బంది సహకారంతో అరెస్టు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఏరియాలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఉంది. ఇక్కడ అనేక ప్రాంతాలకు చెందిన అమ్మాయిలు నివశిస్తూ ఉద్యోగాలు, విద్యాభ్యాసం చేస్తూ వస్తున్నారు. 
 
ఈ హాస్టల్ పక్కనే ఓ బహుళ అంతస్తు భవనం ఉంది. ఈ భవనంలో నుంచి ఆ కంత్రీ కుర్రోడు తన మొబైల్ ఫోనులో అమ్మాయిలు బాత్రూమ్‌లో స్నానం చేస్తుంటే చిత్రీకరించాడు. ఈ క్రమంలో ఓ అమ్మాయి వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో సెల్‌ఫోన్ ఫ్లాష్ లైట్ వెలగడాన్ని గుర్తించింది. దీంతో ఈ బాగోతం బట్టబయలైంది. ఆ బాలుడిపై యువతులు మాదాపూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.
 
కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీడియోలను తన దగ్గరే ఉంచుకున్నాడా? లేక స్నేహితులకు ఎవరికైనా పంపించాడా? అన్న అంశంపై పోలీసులు కూపీలాగుతున్నారు. బాలుడు 8వ తరగతి చదువుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రులే సెల్‌ఫోన్ కొనిచ్చిట్టుగా దర్యాప్తులో తేలింది. అతని ఫోనులో ఏకంగా 30 మంది అమ్మాయిల నగ్న వీడియోలు ఉన్నట్టు పోలీసులు చెప్పారు.