ఆఫీస్ టైమింగ్స్‌లో గ్రీన్ టీ తాగితే..?

Last Updated: బుధవారం, 19 డిశెంబరు 2018 (16:22 IST)
మహిళలు ఆఫీస్ టైమింగ్స్‌లో టీ, కాఫీల కంటే.. గ్రీన్ టీని సేవించడం ద్వారా బరువు పెరగరని వైద్యులు చెప్తున్నారు. అలాగే ఉదయం పూట అల్పాహారం తీసుకోకుండా వుండకూడదు. తగినంత మంచినీళ్లు తాగుతూ ఉండాలి. రోజూ తీసుకునే ఆహారంలో తాజా పండ్లు, డ్రై ఫ్రూట్స్ చేర్చుకోవాలి. సమయానికి ఆహారం తీసుకోవడం మరిచిపోకూడదు. కుర్చీలో కూర్చునా లేదా నిలబడినా నిటారుగా ఉండాలి. 
 
కంప్యూటర్ స్క్రీన్ కంటికి సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. ఇలా చేస్తే మెడ, వెన్ను నొప్పులు రావు. కంప్యూటర్ ముందు కూర్చుని ఉద్యోగం చేసే మహిళల్లో ఎక్కువగా చేతివేళ్ల నొప్పితో బాధపడతారు. 
 
ఉద్యోగాలకు వెళ్లే మహిళలు ఆరోగ్యం మీద దృష్టి సారించాలి. ఏదో కష్టపడే వ్యాయామం చేయాలని కాదు. సింపుల్‌గా వ్యాయామాలు ప్రయత్నించాలి. రోజూ అరగంట నడవాలి. లిఫ్టులను ఉపయోగించకుండా.. మెట్లను ఉపయోగించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :