సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. వ్యక్తిత్వ వికాసం
Written By
Last Updated : గురువారం, 20 డిశెంబరు 2018 (18:23 IST)

నీకు నచ్చినట్టు బ్రతకాలంటే.. ధైర్యం కావాలి..?

1. ఇష్టం ఉంటే.. కోపానికి కూడా ఓ అర్థం ఉంటుంది..
ఇష్టం లేకుంటే నిజమైన ప్రేమ కూడా అర్థంలనిదౌతుంది..
 
2. నీ శత్రువుల మాటలు విను..
ఎందుకంటే.. నీలోని లోపాలు, తప్పులు..
అందరి కన్నా బాగా తెలిసేది వారికే..
 
3. గమ్యం చేరుకోవడానికి మార్గం కాదు.. 
మనసు ఉండాలి.
 
4. నీకు నచ్చినట్టు బ్రతకాలంటే.. ధైర్యం కావాలి..
ప్రపంచానికి నచ్చినట్టు బ్రతకాలంటే సర్దుకుపోవాలి..
 
5. సంబంధాలు ఎప్పుడూ.. మాములుగా చంపబడవు..
అవి ఒకరి నిర్లక్ష్యం, ప్రవర్తన, అహంకారం పూరిత వైఖరి వలన మాత్రమే చంపబడుతాయి. 
 
6. సాధించాలనే తపన.. మన సామర్ధ్య లోపాలను,
బలహీనతలను అధిగమించేలా చేస్తుంది..
 
7. మంచివారిని అతిగా నమ్మకండి.. 
చెడ్డవారిని అతిగా ద్వేషించకండి..
ఎవరూ చివరి వరకు ఒకేలా ఉండలేరు..
పరిస్థితిలో మార్పు రావొచ్చు..