రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన రెడ్డి చేతులు మీదుగా జూలై 1న 108- 104 అంబులెన్స్ వాహనాల ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టరు ఏ.యండి.ఇంతియాజ్ తెలిపారు. పోలీస్ ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి భద్రతా అధికారులు, ఆరోగ్యశ్రీ, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్తు, రోడ్లు భవనాలు, తదితర శాఖల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో ముందస్తు భద్రతా ఏర్పాట్లు పై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. విజయవాడ నగరంలోని బెంజిసర్కిల్ వద్ద...