1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Irrigate every farm: Bihar CM

ప్రతి పొలానికీ సాగునీరు: బీహార్‌ ముఖ్యమంత్రి

Irrigate
రానున్న కాలంలో బీహార్‌లో ప్రతి పొలానికి సాగునీరు అందించడమే తన లక్ష్యమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ పేర్కొన్నారు.

జనతాదళ్‌ యునైటెడ్‌ పార్టీ కార్యకర్తలు సుమారు ఐదు వేల మందితో ఆన్‌లైన్‌లో మాట్లాడిన నితీష్‌ రానున్న ఎన్నికల్లో తన ప్రధాన హామీలను వివరించారు.

బీహార్‌లో 80 శాతం ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రతి పొలానికీ సాగునీరు అనే ఎన్నికల హామీ ప్రజల్లో నిజంగానే ఆశలు రేకితిస్తుంది.

ఈ హామీతోపాటు అందరికీ విద్యుత్‌ సరఫరా, పైపుల ద్వారా మంచినీరు సరఫరా కూడా ఇస్తామని నితీష్‌ హామీ నిచ్చారు. వ్యవసాయానికి అసరమైన కరెంట్‌ నిరంతరం సరఫరా చేసేందుకు ప్రత్యేక ఫీడర్లును ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు.
About Writer
ఎం
తర్వాతి కథనం
హైరిస్క్ వారందరికీ కరోనా పరీక్షలు చేయండి: సిఎస్ నీలం సాహ్ని