శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 12 జూన్ 2020 (20:14 IST)

ఏపి సీఎస్ పదవీకాలం మ‌రో 3 నెల‌లు పొడిగింపు

ఏపీ సీఎస్ నీలం సాహ్ని పదవీకాలం పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక అప్పటివరకు సీఎస్‌గా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యంను మరో పదవికి పంపడం తెలిసిందే.

ఎల్వీ స్థానంలో నీలం సాహ్నీ కొత్త సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు. తాజాగా ఆమె పదవీకాలం మరో 3 నెలలు పొడిగిస్తూ రాష్ట్ర సర్కారు శుక్ర‌వారం ఉత్తర్వులు జారీ చేసింది.

కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తాజా ఉత్తర్వుల ప్రకారం నీలం సాహ్నీ జూలై 1 నుంచి సెప్టెంబరు 30 వరకు సీఎస్‌గా కొనసాగుతారు.