సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 జూన్ 2020 (17:21 IST)

మహానదిలో బయల్పడిన పురాతన ఆలయం.. 500 ఏళ్ల నాటిదట..!

Mahanadi
మహానదిలో పురాతన ఆలయం బయటపడింది. 500 ఏళ్లనాటి పురాతన ఆలయంగా దీన్ని భావిస్తున్నారు. ఒడిశాలోని నయగరా జిల్లా వద్ద వున్న మహానదిలో ఈ ఆలయం బయల్పడింది. ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్‌కు చెందిన ఆర్కియోలాజికల్ సర్వే టీం రీసెంట్‌‌గా కటక్ నుంచి వచ్చే ఎగువ ప్రవాహం కింద ఆలయం ఉన్నట్లు గుర్తించించింది. నయగరా వద్దనున్న పద్మావతి గ్రామంలో బైదీశ్వర్ వద్ద నీటిలో ఉన్న  ఆలయం కనిపించింది.
 
60 అడుగుల పొడవు ఉన్న ఆలయం 15లేదా 16వ శతాబ్దం నాటిదిగా అంచనా వేస్తున్నారు. దాని నిర్మాణంలో వాడిన డిజైన్‌ను బట్టి మస్తక కళ అప్పట్లోనే వాడేవారని పైగా ఆలయ నిర్మాణానికి వాడిన మెటేరియల్ ఆ కాలం నాటిదేనని గుర్తించారు. ఆర్కియాలజిస్టులు దీపక్ కుమార్ నాయక్ మాట్లాడుతూ.. 60 అడుగుల ఎత్తైన ఆలయం గోపీనాథ్ స్వామిదిగా గుర్తించాం. విష్ణువు అవతారాల్లో ఇదొకటి. 15 లేదా 16శతాబ్దాల్లో దీనిని నిర్మించి ఉండొచ్చునని తెలిపారు. 
 
ఈ ఆలయ నిర్మాణం జరిగిన ప్రాంతాన్ని శతపట్టణ అనే వారట. అంటే ఏడు గ్రామాలు కలిసిన పట్టణం అని అర్థం. 150 ఏళ్ల క్రితం నది ప్రవాహ దిశ మార్చుకోవడంతో గ్రామం మొత్తం 19వ శతాబ్దానికి నీటిలో మునిగిపోయింది. పద్మావతి గ్రామంలోని స్థానికులు మాట్లాడుతూ.. ఈ గ్రామంలోని 22 దేవాలయాలు కనుమరుగైపోయాయని అన్నింటి కంటే పొడవైనది కాబట్టి గోపీనాథ్ ఆలయం మాత్రమే చాలాకాలం కనపడుతూ ఉండేదని చెబుతున్నారు.