శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 మే 2020 (14:17 IST)

కరోనా పీడ విరగడ కావాలని నరబలి.. ఎక్కడ?

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి పీడ విరగడ కావాలంటూ ఓ అర్చకుడు నరబలి ఇచ్చాడు. ఈ దారుణ సంఘటన ఒరిస్సా రాష్ట్రంలో వెలుగు చూసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దేశంలోని అన్ని రాష్ట్రాలకు కరోనా వైరస్ వ్యాపించింది. దీంతో అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదైవున్నాయి. పైగా, ప్రభుత్వాలన్నీ లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. 
 
ఈ క్రమంలో కరోనా వైరస్ పోవాలంటూ ఒరిస్సా రాష్ట్రంలోని కటక్ జిల్లా నర్సింగ్ పూర్‌లో బ్రాహ్మణిదేవి ఆలయంలో ఓ అర్చకుడు నరబలి ఇచ్చారు. కరోనా నుంచి ప్రజలకు విముక్తి కలగాలని ఆలయ అర్చకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. 
 
ఈ ఘటన తెలిసి ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఈ సమాచారాన్ని పోలీసులకు చేరవేశాడు. దీంతో అర్చకుడు సంసారి హోజాను పోలీసులు అరెస్టు చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే, నరబలి ఇచ్చిన వ్యక్తి వివరాలు తెలియాల్సివుంది.