గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 12 జూన్ 2020 (19:19 IST)

ఉగ్రవాదిని మాటు వేసి పట్టుకున్న భద్రతా దళాలు

జుమ్మూలో ఉగ్రవాద దాడుల కుట్రను భగ్నం చేస్తూ లష్కరే తోయిబా ఉగ్రవాదిని అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి 9 మి.మీ పిస్టల్, రెండు మ్యాగజైన్స్, కొన్ని రౌండ్లు బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతానికి అతడిని ప్రశ్నిస్తున్నారు. కాశ్మీర్‌లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జమ్మూ కాశ్మీర్ పోలీసులు చేస్తున్న ప్రచారం విజయవంతమవుతోంది.
 
లోయలో శాంతి వాతావరణాన్ని నాశనం చేయడానికి కుట్ర పన్నుతున్న ఉగ్రవాద సంస్థలపై భద్రతా దళాలు ఉక్కుపాదం మోపుతుండటంతో అవి ఇబ్బంది పడుతున్నాయి. లష్కర్-ఎ-తోయిబా ఇటీవల కొంతమంది వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని వారిని హతమార్చడానికి ఉగ్రవాదిగా మారిన యువకుడిని నియమించినట్లు గత రాత్రి పోలీసు వర్గాలకు సమాచారం అందింది.
 
సదరు ఉగ్రవాది కొద్ది దూరంలో ఉన్న ఖోజ్‌పోరాలోని ఒక నిర్దిష్ట ప్రదేశంలో దాక్కున్నాడు. ఇది తెలియగానే పోలీసులు, సైన్యంలోని 1వ ఆర్ఆర్ సైనికులతో కలిసి అతడిని పట్టుకునేందుకు ఆపరేషన్ ప్రారంభించారు. జాకీర్‌ను అతని ఇతర సహచరుల గురించి ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, దీని గురించి ఇంకా ఏ పోలీసు అధికారి మరింత సమాచారం ఇవ్వలేదు. ఇతర వివరాలు తెలియాల్సి వుంది.