బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 15 మే 2020 (23:19 IST)

విరహం తట్టుకోలేక ఆమెను కలవడానికి వచ్చి అడ్డంగా బుక్కైన యువకుడు

అక్రమ సంబంధాలు ఎన్నో కాపురాలను కూల్చేస్తున్నాయి. భార్యతో గొడవపడి భర్త పక్క చూపులు చూస్తే.. మరికొంతమంది భర్తతో గొడవపడి వేరొకరిని వెతుక్కుంటున్నారు. అయితే ఈ అక్రమ సంబంధాలు మాత్రం ఎప్పుడో ఒకసారి బయట పడాలి కదా. అలాంటి ఘటనలే ఎన్నో జరుగుతూనే ఉన్నాయి.
 
పుణేకు చెందిన రాణికి ఏడేళ్ల క్రితం వివాహమైంది. భర్త ప్రభుత్వ ఉద్యోగి. అయితే పిల్లలు లేరు. పిల్లలు లేరని భర్తతో తరచూ రాణికి గొడవ. దీంతో కుటుంబ సమస్యలతో రాణి ఎప్పుడూ సతమతమవుతూనే ఉండేది. 
 
ఈ క్రమంలో ఆమె పాలు పోసే యువకుడితో పరిచయం పెంచుకుంది. మూడు నెలల ముందు నుంచి వీరి మధ్య అక్రమ సంబంధం కొనసాగింది. మొదట్లో ఆ యువకుడికి ఇష్టమైన వంట చేసిపెట్టింది. అలా అతనికి బాగా దగ్గరైంది. శారీరక సంబంధం ఇద్దరూ పెట్టుకున్నారు. ఇది లాక్ డౌన్ ముందు వరకు సాగింది.
 
అయితే ప్రస్తుతం లాక్ డౌన్. ఇంటి నుంచే ఉద్యోగం చేసుకునే అవకాశం ఉండటంతో అదే ధరఖాస్తు చేసుకుని ఇంటి పట్టునే ఉంటున్నాడు రాణి భర్త. అయితే రోజూ భర్త ఇంట్లో ఉండడంతో ఆ యువకుడి విసిగిపోయాడు. పాలు పోసి తిరిగి ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఎలాగైనా ఆమెను కలవాలని ఉవ్విళ్ళూరాడు. 
 
పాలు పోసిన తరువాత రాణి ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. భర్త కూరగాయల కోసం వెళ్ళగానే ఇంట్లో దూరాడు. రాణి వారిస్తున్నా బెడ్రూంలోకి తోసి పని మొదలుపెట్టాడు. కూరగాయలు కొనుక్కుని ఇంటికి వచ్చిన భర్త వారిద్దరినీ చూసి షాకయ్యాడు. యువకుడిని పోలీసులకు అప్పజెప్పాడు.