సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 12 మే 2020 (16:37 IST)

పరాయి మగాడితో పడకసుఖం.. భర్తను చంపి ఇసుకలో పాతిపెట్టిన భార్య!

ఆ మహిళ పక్కింటి పురుషునితో పడక సుఖం గుట్టుచప్పుడు కాకుండా పొందుతూ వచ్చింది. అది ఓ రోజున కట్టుకున్న భర్త కళ్ళారా చూశాడు. అప్పటి నుంచి భార్యను వేధించసాగాడు. దీంతో విసిగిపోయిన ఆ మహిళ.. చివరకు ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చింది. ఆ తర్వాత భర్త శవాన్ని ఇసుకలో పాతిపెట్టింది. తర్వాత తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ దారుణం నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బోధన్‌ మండలం మందార్నలో నివాసముంటున్న గంగామణి అనే మహిళకు సాయిరాం అనే వ్యక్తితో కొన్నేళ్ళ క్రితం వివాహమైంది. వీరికి నాలుగేళ్ళ పాప కూడా ఉంది. అయితే, గంగామణికి అదే గ్రామానికి చెందిన సుభాష్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఓ రోజున వీరిద్దరూ భర్త సాయిరాం కంట్లోపడ్డారు. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు చెలరేగాయి. పైగా, భార్యను నిర్బంధించసాగాడు. 
 
దీంతో విసిగిపోయిన గంగామణి, తన ప్రియుడి సాయంతో హత్య చేసేందుకు ప్లాన్ వేసింది. శుక్రవారం తప్ప తాగి ఇంటికి వచ్చిన భర్త సాయిరాంను తన ప్రియుడు సుభాష్‌, గంగామణి తండ్రి, ఇతర కుటుంబసభ్యులతో కలిసి తీవ్రంగా కొట్టి హత్య చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని గ్రామ శివారులోని మంజీర నదిలో పాతిపెట్టారు. 
 
ఆ తర్వాత తన భర్త మూడు రోజులుగా కనిపించడం లేదని బోరున విలపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో అసలు విషయం వెలుగు చూసింది. మృతదేహాన్ని సోమవారం రూరల్‌ పోలీసులు బయటకు తీసి పోస్టుమార్టానికి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.