బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By వి
Last Modified: శనివారం, 30 మే 2020 (13:46 IST)

కరోనా వైరస్ దెబ్బకు ఉగ్రవాదులు ఉక్కిరిబిక్కిరి, మరణం అంచునే అనేకమంది...

పాకిస్తాన్, ఆక్రమిత కాశ్మీరులోని పాక్ ఉగ్రవాద శిబిరాలను కూడా కరోనా వైరస్ చుట్టుముట్టిందనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని జమ్ము-కాశ్మీరు పోలీసులు తమ కుటుంబ సభ్యులకు తెలిపారు. కరోనా వైరస్ తాకిడి వల్ల ఆక్రమిత పాకిస్తాన్ ఉగ్రవాదులను వారి శిబిరాలను పూర్తిగా కోవిడ్ -19 ముట్టడించిందని, దీని ప్రభావంతో ఉగ్రవాదులు రోగగ్రస్తులయ్యారంటూ కాశ్మీర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ తెలిపారు.
 
మరోవైపు భారతదేశంతో పాటు పాకిస్తాన్ దేశంలోనూ లాక్ డౌన్ కొనసాగుతుండటంతో ఉగ్రవాదులకు ఆహార పదార్థాలు లభించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, అనారోగ్యాలకు గురై మంచానపడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద కరోనా వైరస్ దెబ్బకు ఉగ్రవాదులు ఉక్కిరిబిక్కిరై చాలామంది మృత్యువాత పడే అవకాశం వున్నట్లు ఇండియన్ ఇంటెలిజెన్స్ తెలియజేస్తోంది.