1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 డిశెంబరు 2019 (10:58 IST)

#మెర్రీ క్రిస్మస్.. 80 మంది ఉగ్రమూకల హతం.. పశ్చిమ ఆఫ్రికాలో నరమేధం

పశ్చిమ ఆఫ్రికాలో ఉగ్రమూకలు విధ్వంసం సృష్టించాయి. క్రిస్మస్ రోజున నరమేథం సృష్టించారు. క్రిస్మస్ వేడుకల్లో జిహాదీలు ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో 35 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువమంది మహిళలు ఉన్నారు. 
 
రంగంలోకి దిగిన సైనిక బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 80 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసో రాజధానిలో స్థానిక కాలమానం ప్రకారం.. మంగళవారం (డిసెంబర్ 24,2019) అర్ధరాత్రి ఈ ఘటన చోటు జరిగింది.
 
ఈ ఘటనపై భద్రతా సిబ్బంది మాట్లాడుతూ.. నవంబరులో జరిగిన పలు ఆపరేషన్ కార్యక్రమాల్లో వందలాది మంది టెర్రరిస్టులు మరణించారని.. ఇందుకు ప్రతీకారంగా పౌరులను పొట్టనబెట్టుకున్నారని చెప్పారు. పశ్చిమ ఆఫ్రికాలో రాజధాని నగరాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రమూకలు ఈ దాడులకు పాల్పడ్డాయని తెలిపారు.