ఏకాంతం కోసం అడవులకు వెళ్తే.. పోలీసునని చెప్పి.. మహిళపై..?

lovers
lovers
సెల్వి| Last Updated: బుధవారం, 8 జులై 2020 (16:04 IST)
అక్రమ సంబంధాలు జీవితాలను దారుణంగా మార్చేస్తాయని తెలిసినా.. సమాజంలో తలెత్తుకుని తిరగలేని పరిస్థితి ఏర్పడుతుందని తెలుసుకున్నా.. కొందరు ప్రబుద్ధులు బయటపడకుండా వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నారు. అలా వైవాహిక జీవితాన్ని పక్కనబెట్టి.. అక్రమ సంబంధాన్ని కొనసాగించిన ఇద్దరికి చేదు అనుభవం ఎదురైంది.

వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా బుక్కరాయమండలంలోని కొట్టాపల్లి గ్రామానికి చెందిన మహిళకు వివాహం అయ్యింది. అయినప్పటికీ మరొక వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. రెండు రోజులపాటు ఎక్కడికైనా దూరంగా వెళ్లి ఎంజాయ్ చేయాలని అనుకున్నారు. అటవీ ప్రాంతానికి వెళ్లారు. అడవి కావడంతో ఎవరూ ఉండరని భావించి, శృంగారంలో మునిగిపోయారు.

అంతలో అటుగా వచ్చిన ఓ వ్యక్తిని వీరిని చూసి, తాను పోలీసునని, బెదిరించాడు. మహిళపై అత్యాచారం చేశాడు. ఆమెతో వచ్చిన ప్రియుడు అక్కడే నిలబడి ఆ చోద్యాన్ని చూశాడు. బయటకు చెప్తే పరువు పోతుందని, ఎవరికి ఈ విషయం చెప్పొద్దని ప్రియుడు ఆమెను బతిమిలాడాడు.

కానీ, ఆమె వినలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసునని చెప్పి అత్యాచారం చేసిన నకిలీ పోలీసును, పక్కనే ఉన్న పట్టించుకోని ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.దీనిపై మరింత చదవండి :