శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 జులై 2020 (12:27 IST)

తండ్రీ కొడుకులకు కరోనా... ఆస్పత్రికి వెళ్తూ తండ్రి మృతి

పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం పెర్కిపాలెం గ్రామంలో తండ్రీ కొడుకులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. హాస్పిటల్‌కి తరలిస్తుండగా తండ్రి మృతి చెందాడు. కొడుకుని వైద్య సిబ్బంది ఆసుపత్రికి తరలించింది. 
 
మంగళవారం తండ్రీ కొడుకులకు పాజిటివ్ రిపోర్టు అందించారు. అప్పటి నుంచి అంబులెన్స్ కోసం పలుమార్లు బాధితులు ఫోన్ చేశారు. దాదాపు ఏడు గంటలు ఆలస్యంగా అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ రావడం ఆలస్యం కావడం వలనే తండ్రి చనిపోయాడని బంధువులు పేర్కొంటున్నారు.
 
ఆంధ్రప్రదేశ్‌లో మరో 1,263 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 56 మందికి, విదేశాల నుంచి వచ్చిన ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 16,712 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, మొత్తం 1,322 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది.
 
దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 20,019కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 424 మంది కోవిడ్‌ నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ కాగా, ఏడుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 239కి చేరింది.