సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 జులై 2020 (22:34 IST)

మాస్కు అంటే లెక్కలేదు.. బ్రెజిల్ అధ్యక్షుడికి కరోనా పాజిటివ్

brazil
బ్రెజిల్ దేశాన్ని కరోనా అట్టుడికిస్తోంది. కరోనా విషయంలో బ్రెజిల్ అత్యంత ప్రమాదకర స్థితిలో ఉంది. అమెరికా తర్వాత అత్యధిక కేసులు బ్రెజిల్‌లోనే ఉన్నాయి. ఇప్పటివరకు 16 లక్షలకు పైగా కేసులు బ్రెజిల్‌లో నమోదు అయ్యాయి. 60వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోను కూడా కోవిడ్ సోకింది. ఆయన కోవిడ్-19 బారిన పడ్డారు. కరోనా పరీక్షల్లో ఆయనకు కోవిడ్ పాజిటిక్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.
 
దీనికి ముందు ఆయన రెండుసార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే రెండు పరీక్షల్లోనూ నిగిటివ్‌నే అని తేలింది. ప్రస్తుతం చేసుకున్నది మూడవసారి. ఇకపోతే.. కరోనా టెస్టుల గురించి, మాస్కు ధరించడం గురించి ఈయన చుట్టూ పెద్ద కాంట్రవర్సీనే నడించింది. దేశాధినేతైనా సరే మాస్క్ ధరించాల్సిందేనన్న బ్రెజిల్ కోర్టు వ్యాఖ్యలను ఆయన అర్థం లేనివిగా కొట్టి పారేశారు. 
 
ఇక కరోనా టెస్టు తరుచూ చేసుకోవడం వల్ల తన ఊపిరితిత్తులు శుభ్రపడుతున్నాయని తెలిపారు. కానీ జైర్ బోల్సోనారో తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. బ్రెజిల్‌లోని సావోపాలో గవర్నర్ జాయ్ డోరియా మాట్లాడుతూ బ్రెజిల్‌లో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్నా అధ్యక్షుడికి ఏమాత్రం పట్టింపు లేదని, కరోనా కంటే బోల్సనారో వైరస్ అత్యంత ప్రమాదకరం అంటూ విమర్శలు గుప్పించారు.