అమెరికా: జూనియర్ ట్రంప్‌ గర్ల్ ఫ్రెండ్‌కు కరోనా

Kimberly Guilfoyle
సెల్వి| Last Updated: శనివారం, 4 జులై 2020 (11:56 IST)
Kimberly Guilfoyle
అమెరికాలో కరోనా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ పెద్ద కుమారుడు జూనియర్‌ ట్రంప్‌ గర్ల్ ఫ్రెండ్‌కి కరోనా సోకింది. జూనియర్‌ ట్రంప్‌ స్నేహితురాలు కింబర్లీ గుయిల్‌ఫాయల్‌కు కరోనా వైరస్‌ సోకింది.

ఈ విషయాన్ని అమెరికా మీడియా వెల్లడించింది. గతంలో ఫాక్స్‌ న్యూస్‌లో పనిచేసిన ఆమె ప్రస్తుతం ట్రంప్‌ ఎన్నికల ప్రచార బృందంలో సీనియర్‌ ఫండ్‌ రైజర్‌గా వ్యవహరిస్తున్నారు. ట్రంప్‌ ఆంతరంగీకుల్లో తాజాగా ఈ వైరస్‌ బారినపడింది కింబర్లనీనే కావడం విశేషం. ఈ ఘటనతో అమెరికాలో వైరస్‌ ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది.

వాస్తవానికి ఆమె అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో కలిసి దక్షిణ డకోటాలో ఒక సభలో పాల్గొనాల్సి ఉంది. కానీ, వైరస్‌ సోకినట్లు తేలడంతో ఆమె హాజరుకాలేదు. ఆమెలో ఎటువంటి వ్యాధి లక్షణాలు లేవు. ఇటీవల కాలంలో ఆమె జూనియర్‌ ట్రంప్‌, అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌లతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనలేదని సమాచారం.దీనిపై మరింత చదవండి :