సంబంధిత వార్తలు
- దేశంలో కరోనా.. తెలుగు రాష్ట్రాల కోవిడ్ అప్ డేట్.. పదివేలు దాటాయి
- పండంటి బిడ్డకు జన్మనిచ్చానంటూ వార్త... చూడగాని కృంగిపోయా : నేహా గౌడ్
- కరోనా కరాళ నృత్యం.. తమిళనాడులో ఒకేరోజు 2,865 కేసులు 33మంది మృతి
- దేశాన్ని వణికిస్తోన్న కరోనా.. బెంగాల్ ఎమ్మెల్యే మృతి
- పతంజలి కరోనిల్: కరోనాకు మందు తయారు చేశామన్న రాందేవ్ బాబా.. ప్రచార ప్రకటనలు ఆపాలన్న ఆయుష్ మంత్రిత్వ శాఖ
కోటికి చేరువలో కరోనా కేసులు.. అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా బిజీ.. కోవిడ్ వ్యాప్తి
కరోనా మహమ్మారితో ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వైరస్ బాధితుల సంఖ్య 95 లక్షలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 95,27,125 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 4,84,972 మంది మృతి చెందగా.. కరోనా బారినపడి చికిత్స పొంది 51,75,406 మంది కోలుకున్నారు. ఫలితంగా కరోనా కేసులు ప్రపంచ వ్యాప్తంగా కోటి దగ్గరలో నమోదవుతున్నాయి.
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. న్యూజెర్సీ, న్యూయార్క్‌పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అధ్యక్ష ఎన్నికల హడావిడిలో ఉన్న అమెరికాలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అమెరికాలో ఇప్పటి వరకు 24,62,554 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 1,24,281 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 10,40,605 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన అమెరికా, బ్రెజిల్‌లో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి.
అమెరికాలో బుధవారం ఒక్కరోజే 39 వేల కొత్తకేసులు నమోదవగా, బ్రెజిల్‌లో 41 వేల కేసులు రికార్డయ్యాయి. అత్యధిక కేసుల్లో రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్‌లో తాజాగా 41వేల పైచిలుకు కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 11,92,474కు చేరింది. దేశంలో ఇప్పటివరకు ఈ వైరస్ వల్ల 53,874 మంది మరణించగా, 4,88,692 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 6,06,881 పాజిటివ్ కేసులతో రష్యా మూడోస్థానంలో కొనసాగుతున్నది. దేశంలో ఈవైరస్ వల్ల ఇప్పటివరకు 8513 మంది మృతిచెందారు.
తర్వాతి కథనం
