శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 జూన్ 2020 (19:42 IST)

జకోవిచ్‌‌కు కరోనా.. పిల్లలు తప్పించుకున్నారు.. అంతా ఆడ్రియా ఎఫెక్ట్

అమెరికాలో కరోనా కేసులు అధికమైనా.. యూఎస్ గ్రాండ్ స్లామ్‌ను దాటేసి.. ఫ్రెంచ్ ఓపెన్‌పై దృష్టి పెడతానని చెప్పుకున్న సెర్బియా టెన్నిస్‌ స్టార్‌, వరల్డ్‌ నెంబర్‌ వన్‌ ఆటగాడు నోవాక్‌ జకోవిచ్‌‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించాడు. 
 
గతవారం క్రోయేషియాలో జరిగిన ఆడ్రియా టూర్ ఎగ్జిబిషన్‌ ఈవెంట్‌లో తనతో కలిసి డబుల్స్ ఆడిన బల్గేరియా ఆటగాడు గ్రిగర్‌ దిమిత్రోవ్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. దాంతో తనతో కలిసి ఆడిన వారు అందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరాడు. అయితే దిమిత్రోవ్‌‌తో కలిసి ఆడిన వారిలో జకోవిచ్ కూడా ఉన్నాడు ఇప్పుడు అతనికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. 
 
ఈ నేపథ్యంలో బెల్‌గ్రేడ్‌లో కరోనా పరీక్ష చేయించుకున్నట్లు జకోవిచ్ వెల్లడించాడు. టెస్టులో పాజిటివ్ అని తేలినట్లు చెప్పాడు. అయితే కరోనా పరీక్షల్లో తన భార్య జెలెనాకు కూడా కరోనా సోకినట్లు తెలిపిన జకోవిచ్ తన పిల్లలకు మాత్రం నెగిటివ్‌ వచ్చినట్లు తేల్చాడు.