'కోరోనిల్' పేరుతో కరోనాకు పతంజలి మందు.. 5 నుంచి 14 రోజుల్లో...?
'కోరోనిల్' పేరుతో కరోనాకు ఆయుర్వేద మందు తీసుకువచ్చినట్లు దేశీయ కంపెనీ పతంజలి తెలిపింది. ఈ మందును మార్కెట్లోకి తీసుకువచ్చినట్లు బాబా రాందేవ్ తెలిపారు. హరిద్వార్‌లోని యోగ్‌పీఠ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ మందును ఆవిష్కరించారు.
'కరోనిల్' మాత్రల ద్వారా 14 రోజుల్లో కరోనాను నయం చేయవచ్చని పతంజలి సంస్థ పేర్కొంది. కరోనా వైరస్‌కు మందును తీసుకువస్తున్నామని గతంలోనే పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ తెలిపారు. తమ మందు 5 నుంచి 14 రోజుల్లో కోవిడ్‌ను నయం చేయగలదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రాందేవ్ మాట్లాడుతూ.. 'కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. ఇలాంటి విపత్కర సమయంలో మందు తీసుకురావడం ముఖ్యమైన ప్రక్రియ అన్నారు.
ఆయుర్వేదంతో కరోనాను నయం చేయవచ్చునని చెప్పుకొచ్చారు. ఈ మందుతో మూడు రోజుల పరిశీలనలో 69 శాతం మందికి నెగిటివ్ రావడం శుభసూచకమన్నారు. మందును తీసుకురావడంలో తమ శాస్త్రవేత్తలు చేసిన కృషి అభినందనీయమని రాందేవ్ పేర్కొన్నారు.