కరోనా వైరస్‌కు మందు కనిపెట్టిన తిరుమల తిరుపతి దేవస్థానం
ప్రపంచ దేశాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం రోజు రోజుకీ పెరిగిపోతుంది. కరోనా వైరస్ కారణంగా భారతదేశంలోని ఎన్నో సుప్రసిద్ధ ఆలయాలు మూతపడిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానం కూడా మూతపడింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తుల రాకపోకలు నిలిపివేశారు.
నిత్యం లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది శ్రీవారి ఆలయం. ఇక ఆకలి అన్నవారికి కడుపునిండా అన్నం పెట్టే సత్రం తిరుమల తిరుపతి దేవస్థానం. కేవలం భక్తుల ఆకలి తీర్చడమే కాదు భక్తులు ఆరోగ్యం కోసం కూడా ఎన్నో ఆయుర్వేద మందులను తయారు చేసేందుకు టీటీడీ సిద్ధమౌతోంది.
తాజాగా దేశాన్ని కబళిస్తున్న కరోనా వైరస్ కట్టడి చేసేందుకు ఆయుర్వేద మందులను తయారు చేసేందుకు సిద్ధమైంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎస్వీ ఆయుర్వేద కళాశాల, ఎస్వీ ఆయుర్వేద దావఖాన, ఎస్వి ఫార్మసీలు సంయుక్తంగా కరోనా వైరస్ నియంత్రణ కోసం ఐదు రకాల ఆయుర్వేద మందులను తయారు చేస్తున్నట్లు టీటీడీ జేఈవో వసంతకుమార్ వెల్లడించారు.
ఈ ఆయుర్వేద మందులు టీటీడీ అన్న ప్రసాదం సిబ్బందికి అందజేశారు. కరోనా వైరస్ నివారణకు ఉపయోగపడే ఈ మందులను విడతలవారీగా పంపిణీ చేయనున్నట్టు టీటీడీ వెల్లడించింది.