శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 జులై 2020 (22:54 IST)

తెలంగాణలో కరోనా ఉగ్రరూపం.. 1,879 కేసులు.. ఏడుగురు మృతి

తెలంగాణలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. తెలంగాణలో తాజాగా 1,879 పాజిటివ్ కేసులు నమోదైనాయి. అంతేగాకుండా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా 313 మంది కరోనా సోకి మృతి చెందినట్లైంది. ఇప్పటివరకూ అన్ని జిల్లాల్లో 27,612 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇంకా 11,012 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. తాజాగా 1,506 మంది డిశ్చార్జి కాగా ఇప్పటివరకూ 16,287 మంది డిశ్చార్జి అయ్యారు.
 
మంగళవారం 6220 శాంపిల్స్ సేకరించగా.. 4341 మందికి నెగిటివ్ వచ్చింది. ఇప్పటివరకూ 1,28,438 మంది నుంచి శాంపిల్స్ సేకరించగా వారిలో 1,00,826 మందికి నెగిటివ్‌ వచ్చినట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 1422 కేసులు వచ్చినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. ప్రస్తుతం 11,012 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది.