శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 జులై 2020 (12:30 IST)

872 మంది రైల్వే ఉద్యోగులకు కరోనా-86మంది మృతి

దేశంలో కరోనా విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో.. పలు జోన్లలో పనిచేస్తున్న రైల్వే ఉద్యోగులు కరోనా బారినపడుతున్నారు. సెంట్రల్‌ రైల్వే, వెస్ట్రన్‌ రైల్వేకు చెందిన సుమారు 872 మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, రిటైర్డ్‌ ఉద్యోగులకు కరోనా వైరస్ సోకింది. ఇప్పటి వరకూ కరోనా వల్ల 86 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 
 
బాధితులందరిని వెస్ట్రన్‌ రైల్వేకు చెందిన జగ్జీవన్‌ రామ్‌ ఆస్పత్రిలో చేర్పించారు. కోవిడ్‌-19 రోగుల చికిత్స కోసం ఏప్రిల్‌లో హాస్పిటల్‌ను ప్రత్యేకంగా కేటాయించారు. అత్యధికంగా సెంట్రల్‌ రైల్వేలో 559 మంది, వెస్ట్రన్‌ రైల్వే నుంచి 313 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మృతిచెందిన వారిలో 86 మందిలో 22 మంది రైల్వే ఉద్యోగులు కాగా, మిగిలిన వారిలో వారి కుటుంబసభ్యులు, రిటైర్డ్‌ సిబ్బంది ఉన్నారు.