1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Eight TTD staff test positive for COVID-19; Kadapa temple closed

టీటీడీని వదిలిపెట్టని కరోనా.. సిబ్బందికి మాత్రమే.. భక్తులు సేఫ్

TTD staff
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)ని కూడా కరోనా వదల్లేదు. టీటీడీ సిబ్బంది సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటివరకు 17మంది సిబ్బందికి కోవిడ్ సోకింది. ప్రతిరోజూ వేలాది మంది తరలివచ్చే ఆలయంలో సిబ్బంది అనారోగ్యం బారిన పడుతుంటంతో కలకలం రేపుతూనే ఉంది. 
 
ఇందులో ముఖ్యంగా అర్చకులు, సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. ఈ క్రమంలో టీటీడీ బోర్డు అత్యవసర సమావేశం నిర్వహించింది. ఆలయంలో ఏర్పాట్లు, ఇతర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. తిరుమలలో విధుల కారణంగా ఉద్యోగులకు కరోనా సోకలేదని అన్నారు.
 
సిబ్బందికి వ్యాధి వచ్చినా కూడా భక్తులు ఎవరికి సోకలేదని చెప్పారు. ఉద్యోగుల్లో మనోదైర్యాన్ని నింపుతామని సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు. ఉద్యోగుల భద్రతపై చర్చించడానికి కమిటీని కూడా వేస్తామన్నారు. 
 
15 రోజుల పాటు ఉద్యోగులు తిరుమలలోనే విధులు నిర్వర్తించేలా మార్పులు చేయాలన్నారు. ఇక తిరుమలకు వచ్చే ప్రతి ఉద్యోగికి కరోనా పరిక్షలు నిర్వహించిన అనంతరం అనుమతిస్తామన్నారు. ఆర్జిత సేవలను ఇప్పట్లో ప్రారంభించేది లేదని స్పష్టం చేశారు.
 
లాక్‌డౌన్ సడలింపుల తర్వాత రోజుకు 6వేల మంది భక్తులకు దర్శనాలు కల్పించారు. ఇటీవల వాటిని 12 వేల వరకు పెంచారు. ఇక ఇప్పట్లో భక్తుల సంఖ్య పెంచబోమని వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
మొండి కర్నాకట ప్రభుత్వం: పరీక్షలు పెట్టింది, విద్యార్థులను కరోనా బారిన పడేసింది